శరీరాకృతి పొందికగా ఆకర్షణీయంగా ఉండాలని ఎవరు మాత్రం కోరుకోరు? అమ్మాయిలే కాదు నడివయసు వారు కూడా సన్నగా, నాజూగ్గా ఉండాలని కఠోర వ్యాయామాలకు పూనుకుంటున్నారు. అయినా సరే తమ బరువును మాత్రం తగ్గించుకోలేకపోతున్నారు. ఒకేసారిగా శరీరంలో ఎక్కువ కాలరీలు కోల్పోవడం వల్ల, ఆకలి పెరిగిపోతుందనీ, దీంతో మామూలుకన్నా ఎక్కువ ఆహారం తీసుకోవడం వల్ల కోల్పోయిన కాలరీలు తిరిగి సమకూరి బరువు మాత్రం అదే స్థాయిలో ఉంటుందని నిపుణులు సెలవిస్తున్నారు.ఎంత శ్రమకోర్చి వ్యాయామాలు చేసినా, ఆరామ్‌గా కూర్చుని బర్గర్లు, పేస్ట్రీలు, చిప్స్ లాగిస్తే తేలిగ్గా బరువు పెరిగిపోతుందనీ, అందుకే అతి వ్యాయామమూ అనర్ధమేనంటున్నారు.
బరువు తగ్గాలంటే వ్యాయామం చేయాలి. ఇది అందరూ ఒప్పుకొనేమాట. స్థూలకాయం సమస్య అధికంగా ఉన్న అమెరికాలో శరీరబరువుకి, వ్యాయామానికి ఉన్న సంబంధంపై జరిగిన తాజా పరిశోధనలు ఫలితాలు అందరూ ఒప్పుకొనే పైమాటని ఒమ్ముచేసేవిగా ఉన్నాయి. నిజానికి వ్యాయామం అన్నది బరువు తగ్గడానికి దారితీయకపోగా పెరగడానికి దోహదపడుతున్నట్లు తేలింది. సాధారణంగా కఠోర వ్యాయామం తర్వాత ఆకలి పెరగడం, అందువల్ల వెంటనే ఎక్కువగా తినడం జరుగుతోందని ఈ పరిశోధనల్లో తేలింది. కొంతమంది కఠోర వ్యాయామం చేసినందుకు తమను తాము అభినందించుకొనే క్రమంలో ఎక్కువగా తింటున్నట్టు కూడా వెల్లడైంది. మొత్తానికి బరువు తగ్గడానికి కఠోర వ్యాయామం మార్గం కాదని అమెరికాలో చాలామంది వైద్యులు చెబుతున్నారు.
సాధారణంగా టీ.వీ వంటి మీడియాల్లో జిమ్ వ్యాపార ప్రకటనలు వ్యాయామం ద్వారా బరువు తగ్గిస్తామని, స్థూలకాయం సమస్య లేకుండా చేస్తామని మాట ఇస్తూ ఉంటాయి. చాలామంది ఈ వాగ్దానాన్ని నమ్మి జిమ్‌ల దారి పడతారు. అమెరికాలో కూడా అదేపరిస్థితి. ఇలాంటి వ్యాపార ప్రకటనలను నమ్మి కొద్దికాలం వ్యాయామం తర్వాత బరువు తగ్గించుకున్న కొంతమంది ఆ వ్యాయామం తంతు ముగిశాక మరికొంత కాలానికి రెట్టింపు బరువు పెరుగుతున్నారు.
పబ్లిక్ లైబ్రరీ ఆఫ్ సైన్స్ అనే పత్రిక ఇటీవల అమెరికాలో ఈవిషయంపై జరిగిన ఒక అధ్యయనాన్ని ప్రచురించింది. ఈ అధ్యయనం వ్యాయామంతో శరీర బరువు తగ్గదని గట్టిగా వాదించే డాక్టర్ ఎరిక్‌రావుసిన్ శిష్యుని పర్యవేక్షణలో జరిగింది. ఆయన పేరు డాక్టర్ తిమోతిచర్చ్. ఈ పరిశోధనా బృందం 464మంది అధికబరువుగల మహిళలను నాలుగు బృందాలుగా విభజించి ఆరు నెలల పాటు వారిని భిన్న పరిస్థితుల్లో అధ్యయనం చేసింది. వారిలో ఒక శిక్షకుని పర్యవేక్షణలో కఠోరవ్యాయామం ఆచరించిన బృందంలోని వారు ఆశ్చర్యకరంగా అధికంగా బరువు పెరిగారు. రోజువారీ ఆహారపుటలవాట్లు మార్చకుండా కొనసాగించిన బృందంలో మహిళలు బరువు తక్కువగానే పెరిగారు. ఇలా ఎందుకు జరిగింది?
సాధారణ మోతాదులో ఆహారం తీసుకున్నవారు చిరుతిళ్లు తక్కువ తిన్నారు. కఠోర వ్యాయామం చేసినవాళ్లు ఆకలికి తట్టుకోలేక అపరిమితంగా తిన్నారు. ఫలితంగా మొదటి వారు బరువు కొద్దిగా పెరగగా, వ్యాయామం చేసినవారు బరువు అధికంగా పెరిగారని నిపుణులు తేల్చారు. అమెరికాలో బరువు తగ్గడానికి వ్యాయామం చేయాల్సిందిగా అటు ప్రభుత్వం, ఇటు ప్రైవేట్ సంస్థలు ప్రోత్సహిస్తున్న నేపథ్యంలో పై అధ్యయనానికి విలువ పెరిగింది. ఆహారపుటలవాట్లు మార్చుకోని వారు, కఠోర వ్యాయామం చేసినవారు ఇరువురూ బరువు పెరిగితే ఇక వ్యాయామం దేనికి అన్న ప్రశ్న ఈ అధ్యయనం లేవనెత్తింది. 2007లో అమెరికన్ కాలేజ్ ఆఫ్ స్పోర్ట్స్ మెడిసన్, అమెరికన్ హార్ట్ అసోసియేషన్ శరీర బర ువు తగ్గించుకోవడానికి కొత్త మార్గదర్శకాలను నిర్దేశించాయి. ఆ సూత్రాల ప్రకారం ప్రతి మనిషి అరవై నుంచి తొంభైనిమిషాల శారీరక వ్యాయామం చేస్తే చాలు బరువు తగ్గుతారు. అంటే వారంలో చాలారోజులు పాటు రోజుకీ 60 నుంచి 90 నిమిషాల వ్యాయామం చేయాలి. డాక్టర్ తిమోతిచర్చ్ చెప్పినదాని ప్రకారం ఇలా చేస్తే బరువుతగ్గకపోగా ఇంకా పెరుగుతారు. ఎందుకంటే అంతసేపు వ్యాయామం వల్ల వారిలో 'కాంపెన్‌సేటరీ ఈటింగ్ పెరుగుతుంది. అంటే వ్యాయామ శ్రమని పరిహరించుకోవడానికి తినే తిండి పెరుగుతుంది. డాక్టర్ చర్చ్ ఏ వ్యాయామం వల్ల ఎంత కేలరీస్ ఖర్చవుతాయో చెబుతూనే ఆ పనుల తరువాత ఒక మఫిన్ తింటే తిరిగి ఆ కేలరీల శక్తి మనని చేరుకుంటుందని హెచ్చరించారు.
ప్రతి మనిషి సహజంగా తమకు అవసరమైన శక్తిమేరకు కేలరీలుంచుకుని, తక్కినది ఖర్చుచేసేవిధంగా పరిణామం చెందలేదని డాక్టర్ చర్చ్ చెబుతున్నారు. అదనపు కేలరీలతో మెలిగే శక్తిని ఎలుకలు పరిణామక్రమంలో సంతరించుకున్నాయి. ఈవిషయంలో మానవులకంటే ఎలుకలు మేలు. ఎందుకంటే ఎలుకల్లో 'బ్రౌన్‌ఫాట్ అనిపిలిచే ముదురు రంగు టిస్యూ ఎక్కువగా ఉంటుంది. 'మిటోచోండ్రియా అనే అతిచిన్న కణాల యూనిట్లను పరిహరించడంలో ఈ బ్రౌన్‌ఫాట్ చాలా చురుగ్గా పనిచేస్తోంది. ఈ కణజాలం పోషకాలను శక్తిగా మారుస్తుంది. అవి స్విచ్‌ఆఫ్ అయినపుడు జంతువులు శక్తికి ఉద్దీపన పొందలేవు. శక్తి పొందడానికి బదులుగా వాటి శరీరం వేడెక్కుతుంది. అందువల్ల అదనపు కేలరీలు వేగంగా ఖర్చయిపోతాయి. బ్రౌన్‌ఫాట్ ఎక్కువగా ఉంటే స్థూలకాయం రాదు. మానవుల శరీరంలో ఈ బ్రౌన్‌ఫాట్ దురదృష్టవశాత్తు చాలా తక్కువ. అందుకే సరదాకోసం చిరుతిండి తిన్నా మనలో ఒళ్లు పెరిగే ప్రమాదం ఆ మేరకు పెరుగుతోంది. గత ముఫ్పైఏళ్లుగా ఎంతమంది ట్రైనర్లు, యోగ గురువులు, వ్యాయామ ఏజెంట్లు కృషి చేసినా శరీర బరువు సమస్య ఎంతమాత్రం తగ్గలేదంటే కారణం అర్థమయ్యే ఉంటుంది.
బరువు తగ్గించుకునే క్రమంలో ఉదయం గంట సాయంత్రం గంట బ్రిస్క్‌వాక్ చేసి, మూడు నెలల్లో ఐదు కేజీల బరువు తగ్గిన వారు, ఆ తరువాత తిండి యావ పెరిగిపోయి అతిగా ఆహారం తీసుకుంటే నెలలోపలే ఐదు కేజీల బరువు పెరిగిపోతున్నారు. దీనికన్నా ఇంట్లో చేయాల్సిన పనులు బట్టలు ఉతకడం, ఇల్లు తుడవడం, గిన్నెలు తోమడవం మార్కెట్‌కు వెళ్ళి రావడం, ఫ్యాట్ ఫుడ్ తగ్గించడం లాంటి సాధారణ పనులు, ఆహారం వల్ల కేలరీలు సమపాళ్ళలో శరీరానికి అందుతాయని నిపుణులు భావిస్తున్నారు. అతి ఏ విషయంలోనైనా అనర్థమే అనడంలో ఇదీ ఒక ఉదాహరణగా నిలుస్తుంది.
బరువు నిర్వహణ
ఆదివారం 17 జూలై 2011
శుక్రవారం 1 జూలై 2011
ఊబకాయాన్ని నియంత్రించేందుకు స్కిప్పింగ్ చేయాలా
శరీర బరువును తగ్గించాలన్నా, ఊబకాయాన్ని నివారించాలన్నా, శరీరం మరింత దృఢత్వంగా ఉండాలంటే చాలామంది డైట్ కంట్రోల్ చేస్తుంటారు. డైట్ కంట్రోల్ చేసినంత మాత్రాన బరువు తగ్గడం లేదా ఊబకాయం తగ్గడంలాంటివి కొద్ది రోజులవరకే తగ్గినట్టుగా అనిపిస్తుంది. కాని మళ్ళీ యాధస్థితికి చేరుకుంటుంది. కాబట్టి చిన్నప్పుడు ఆడుకున్న ఆట తాడాట(స్కిప్పింగ్) ఆడితే తప్పనిసరిగా బరువును నియంత్రించవచ్చు. ఊబకాయాన్ని నివారించవచ్చంటున్నారు ఆరోగ్య నిపుణులు.
వయసు పెరిగిపోయిందికదా ఇంకా చిన్నపిల్లల్లా గెంతడమేంటి అని ఏమరపాటుగా ఉండకండి. స్కిప్పింగ్ చేస్తే శరీర బరువు దానంతట అదే తగ్గి చాలా నాజూకుగా తయారవుతారు. దీనికి ఎప్పుడుపడితే అప్పుడు స్కిప్పింగ్ చేయాల్సిన పనిలేదు. ప్రతి రోజు ఉదయం, సాయంత్రం నిర్ణీత సమయంలో చేస్తుంటే బరువు తగ్గి చలాకీగా తయారవుతారంటున్నారు వైద్యులు.
* ముందుగా రెండు నిమిషాలపాటు తాడాట ఆడండి. అది కూడా మెల-మెల్లగా దుమికేందుకు ప్రయత్నించండి. రెండు నిమిషాలు ఆడిన తర్వాత మీ శరీరం కాస్త వేడెక్కుతుంది. తర్వాత వేగాన్ని పెంచండి.
* స్కిప్పింగ్ చేసిన తర్వాత ఐదు నిమిషాలపాటు విశ్రాంతి తీసుకోండి. లేదా శవాసనం వేయండి. దీంతో శరీరంలోనున్న అలసట కాస్త తగ్గుతుంది.
* అరగంట తర్వాత తేలికపాటి ఆహారం తీసుకోండి. ఉదా- మొలకెత్తిన గింజలు లేదా ఉడకబెట్టిన పెసలు, యాపిల్ పండు, అరటిపండు, పాలు, నిమ్మకాయ రసం వీటిలో ఏదైనా తీసుకోండి.
* స్కిప్పింగ్‌కు ప్లాస్టిక్ వైరును ఉపయోగించండి.
లాభాలుః
* స్కిప్పింగ్ చేసిన తర్వాత త్వరత్వరగా శ్వాస తీసుకోవాల్సివుంటుంది. దీంతో ఊపిరితిత్తులు ఆరోగ్యంగా ఉంటాయి.
* కాళ్ళు, తొడలవద్దనున్న కండరాలు బలిష్టంగా తయారవుతాయి.
* స్కిప్పింగ్ చేయడంతో ఉదరభాగం లోపలికి-బయటకు వెళుతుంటుంది. దీంతో ఉదరభాగంలో పేరుకుపోయిన అదనపు కొవ్వు కరిగిపోతుందంటున్నారు ఆరోగ్య నిపుణులు.
* స్కిప్పింగ్ చేయడంతో తరచూ భూజాలు తిప్పుతుంటారు. దీంతో భుజాలు గుండ్రంగా తయారవుతాయి.
* చేతి మడమలు తిప్పుతుండటంతో వేళ్ళకు మరింతగా బలం చేకూరుతుంది. రచయితలకు, కళాకారులకు ఇది ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది.
* స్కిప్పింగ్ చేయడం వలన శరీరం దృఢంగా తయారవుతుంది.
స్కిప్పింగ్ ఎవరెవరు చేయకూడదంటేః
* అధిక రక్తపోటున్న వారు ఈ వ్యాయామం చేయకూడదు.
* సిజేరియన్ చేసుకున్న మహిళలు మూడు నెలల తర్వాత వైద్యుల సలహా మేరకు స్కిప్పింగ్ చేసేందుకు ప్రయత్నించాలి.
* హెర్నియా రోగులు స్కిప్పింగ్ చేయకూడదు.
* గుండె సంబంధిత జబ్బులతో బాధపడేవారు ఈ వ్యాయామం చేయకూడదంటున్నారు ఆరోగ్య నిపుణులు.

ఎండ తగలకపోతే ఊబకాయం ఖాయం
ఎండను చూసి భయపడి ఇంట్లో కూచుంటే లావెక్కిపోవడం ఖాయమంటున్నారు పరిశోధకులు. ప్రతిరోజూ కనీసం 30 నిమిషాలైనా సూర్యరర్శి శరీరాన్ని తాకేవిధంగా చూసుకోవాలి. అలా చేయకపోతే శరీరానికి అవసరమైన డి. విటమిన్ అందదు.
డి విటమిన్ అనేది శరీరానికి క్యాల్షియం గ్రహించే శక్తినిస్తుంది. సూర్యకాంతి పడక, డి విటమిన్ తయారవక పోతే శరీరంలో క్యాల్షియం లోపం ఏర్పడుతుంది. ఫలితంగా శరీరం దృఢత్వాన్ని కోల్పోతుంది.
శరీరంలో క్యాల్షియమ్‌కి భారీకాయానికి సంబంధముంది. భారీకాయం కలవారు క్యాల్షియం లోపం కలిగి ఉంటారు. కాబట్టి మీరు మీ పిల్లలతో సహా సాయంత్రపు ఎండలో సమీపంలోని పార్క్‌లకు వెళ్లండి. ఇంటి పెరడు ఉంటే అక్కడ పిల్లలతో చేరి ఆటలాడండి. ఏసీ ఉన్న ఆఫీసుల్లో పనిచేసేవారు ఊబగా మారిపోవడానికి కారణం వారికి ఎండ తగలక పోవడమే..!!

అధిక కంప్యూటర్ వర్క్: ఊబకాయం ఖాయం
కంప్యూటర్‌పై ఎక్కువ సమయం గడుపుతున్నరా...? అయితే జాగ్రత్త! సాదారణంగా కంప్యూటర్ ముందు ఎక్కవ సమయం గడిపే వారికి మహా ఐతే కంటి జబ్బులు, వళ్లునొప్పులు, మానసిక ఒత్తిళ్లు వంటివి వస్తాయని అంటారు...! మరి కొత్త విషయం ఏంటని అడుగుతారా....? అయితే ఇది చదవండి మరీ...
తాజా పరిశోధనల ప్రకారం తేలిందేటయా అంటే... కంప్యూటర్‌పై ఎక్కువ సమయం గడిపే వారికి తీపి వస్తువులు బాగా తినాలనిపిస్తుందట. అంటే చాక్లెట్లు, బిస్కెట్లు లాంటివన్నమాట. కంప్యూటర్‌పై ఎక్కువ సమయం పనిచేయడం వల్ల మానసిక ఒత్తిడి పెరిగి రక్తంలోని చక్కెర, హర్మోన్ల మీద ప్రభావం చూపి మెదడు మీద ఒత్తిడిని పెంచుతుంది. తద్వారా శరీరంలోని చాలా కేలరీలు ఖర్చు అవుతాయి.
ఆఫీసుల్లో పనిచేసే వారు తరచూ విరామం తీసుకుంటుండాలి. లేచి నిలబడడం, కళ్లను చల్లటి నీళ్లతో శుభ్రం చేసుకోవడం వంటివి చేస్తూ ఉండాలి. దీనిపై కొపెన్హగెన్ కళాశాలకు చెందిన జీన్ ఫిలిప్ ఛపట్ ఓ పరిశోధన చేశారు. ఇందులో భాగంగా ఆయన విద్యార్థినుల సమూహానికి 45 నిమిషాల నిడివి గల ఓ సందేశాన్ని టైపు చేయమని, ఇదే సమయంలో మరో సమూహాన్ని విశ్రాంతి తీసుకోమని చెప్పారు.
విశ్రాంతి తీసుకున్న వారితో పోలిస్తే కంప్యూటర్‌పై పనిచేసిన వారిలో కేవలం మూడు కేలరీల శక్తి మాత్రమే ఖర్చయినట్లు వెల్లడైంది. కానీ ఆ తర్వాత ఏర్పాటు చేసిన విందులో విశ్రాంతి తీసుకున్నవారికంటే కంప్యూటర్‌పై పనిచేసినవారు అధికంగా ఆహారం తీసుకున్నారట. అంటే... సుమారు అదనంగా 230 కేలరీలను వీరు తీసుకున్నారు. కదలకుండా కూర్చుని పనిచేసే వారు ఇలా తినడం వల్ల అధిక బరువు పెరిగడం ఖాయం. ఫలితంగా ఊబకాయ సమస్యలు తలెత్తే అవకాశం ఉందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

పిల్లల్లో ఊబకాయం
ఇటీవల కాలంలో పిల్లల్లో ఊబకాయ సమస్య బాగా కనిపిస్తోంది. మారిన ఆహారపు అలవాట్లు ముఖ్యంగా ఫాస్ట్‌ఫుడ్ సంస్కృతి, శీతలపానీయాలు బాగా తీసుకవడం వంటివి లావెక్కడానికి ప్రధాన కారణాలు. భారీ శరీరం వల్ల పిల్లలు వారి వయసుకు మించి కనిపిస్తారు. ఆరోగ్యానికి కూడా ఊబకాయం మంచిది కాదు. పిల్లల్లోని ఈ భారీకాయ సమస్యని ఒక్కసారి తగ్గించడం సాధ్యమయ్యే విషయం కాదు. కింద పేర్కొన్న అంశాలను పరిగణనలో పెట్టుకుని, ఇచ్చిన వ్యాయామాలను క్రమం తప్పకుండా పిల్లల చేత చేయించాలి.
పిల్లలు తమ ఫాస్ట్‌ఫుడ్ జీవనశైలిని మార్చుకునేలా ప్రోత్సహించాలి. శారీరకంగా ఉస్తాహంగా ఉండేట్టు వారిని తీర్చిదిద్దాలి. ఆరోగ్యకరమైన అహారాన్ని వాళ్లకి అలవాటు చేయాలి.
టీవి ముందర గంటల తరబడి కూర్చోనివ్వద్దు. ఈ అలవాటు వల్లే పిల్లల్లో ఊబకాయ సమస్య ఎక్కువవుతోంది.
టివిలోని వ్యాపార ప్రకటనలు రకరకాల తిళ్లవైపు పిల్లల్ని ఆకర్షిస్తున్నాయి. వాటన్నింటినీ అడిగారని కొనిపెట్టొద్దు. ఆటల పట్ల పిల్లల్లో ఆసక్తిని పెంచాలి.
పిల్లల్లో టీవి చూసే అలవాటును తగ్గించడానికి అవసరమైతే తల్లిదండ్రులు కూడా టివిని చూడకుండా ఆపేయాలి.
కంప్యూటర్ గేమ్‌స్ ఆడుతూ కంప్యూటర్ స్క్రీన్ ముందర నుంచి పిల్లల ఒకపట్టాన కదలడం లేదు. ఎక్కువసేపు కంప్యూటర్ గేమ్‌స్‌కి అనుమతించొద్దు. అవసరమైతే కఠినంగా ఉండండి.
బడిలో, కమ్యూనిటీ ఆటల్లో పాల్గొనమని పిల్లల్ని ప్రోత్సహిస్తుండాలి. పిల్లలకు కొత్త కొత్త విషయాలు చెపుతుంటే రకరకాల ఆసక్తులు పెరుగుతాయి.
సూచనలు:
పిల్లలతో ఎక్కువసేపు గడిపేలా టైంని సర్దుబాటు చేసుకోవాలి.
పిల్లలతో వారితో ఆటలు ఆడడం. సైక్లింగ్, స్విమ్మింగ్ వంటివి నేర్పాలి. ఇంట్లో పనులు చేసుకునేటప్పుడు పిల్లలకి కూడా చిన్న చిన్న పనులు చెప్పి చేయిస్తుండాలి.
ఇంట్లో లావున్నపిల్లాడికి తక్కువ పెట్టడం, సన్నగా ఉండే పిల్లవాడికి ఎక్కువ పెట్టడం వంటి తేడాపాడాలు చూపకుండా అందరికీ ఒకేరకంగా ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లను పెంపొందించాలి.
లావు తక్కువగా ఉండడం వల్ల, మంచి ఆహారపు అలవాట్లను పాటించడం వల్ల కలిగే దీర్ఘకాలిక ప్రయోజనాలను పిల్లలకు అర్ధమయ్యేలా తరచూ చెపుతుండాలి. ఎప్పటికైనా ఈ మాటలు వారి బుర్రలో పడతాయి.
ఇది తిను. ఇది అస్సలు తినొద్దు అంటూ ఒక్క సారే పిల్లలపై ఒత్తిడి తేకుండా మెల్లగా పిల్లల్లోని అనారోగ్యపు అలవాట్లను పోగొట్టాలి. బెదిరించొద్దు. అలా చేస్తే మరింత మొండికెత్తుతారు. మెల్లగా చెప్పండి.
చాతీ వ్యాయామాలు
స్టెమిలిటీబాల్‌పై వన్ ఆర్మ్ బెంచ్ వర్కవుట్:
స్టెబిలిటీబాల్ మీద వెల్లకిలా పడుకోవాలి. బంతిపై మెడను స్ట్రెట్ పొజిషన్‌లో ఆనిచ్చి పెట్టాలి. నడుము కిందభాగం కొద్దిగా పైకి లేపి దానికి తగ్గట్టు శరీరాన్ని సమస్థితిలో వంచాలి. రెండు చేతులతో డంబెల్స్ పట్టుకోవాలి. ఒక చేయిని పైకి లేపి మెల్లగా దాని మోచేతిని చాతికి దగ్గరగా తీసుకుని వచ్చి డంబెల్‌తో ప్రెస్స్ చేయాలి. అలాగే రెండవ చేతితో కూడా చేయాలి.
పుషప్స్: స్టెమిలిటీ బాల్ మీద పిట్టను ఆనించి బోర్లా పడుకోవాలి. నేలపై అరచేతులు ఆనించాలి. మోచేతులను వంచుతూ శరీరాన్ని మెల్లగా కిందకిదించూతూ పుషప్స్ చేయాలి. ఇలా 10-15మార్లు రెండు లేదా మూడు సెట్లు చేయాలి.
మూలం: ఈనాడు

ఆదివారం 21 మార్చి 2010
మన ఆహారం-కేలరీలు
ఇది చూడండి
అన్నం 1 కప్ =170 కేలరీలు
పుల్కా 1 = 80 కే..
పరాటా = 150 కే..
పూరి చిన్నది =100 కే..
బ్రెడ్ 2 = 170...
ఉప్మా 1 కప్.=270...
ఇడ్లీ 2 చిన్నవి =150....
దోస 1 = 125...
కిచిడి 1 కప్ =200...
సాంబార్ 1 కప్ = 110...
కూర 1 కప్= 70...
గ్రుడ్డు 1 = 160...
మాంసం అర కప్పు= 270..
.కోడి అరకప్పు= 250...
చేప 1 ముక్క =70...
మసాలా వడ,దోస ,సమొసా = 200ఇలానూ బరువు తగ్గొచ్చు!
ఈ ఏడాదయినా బరువు తగ్గాలనేది...చాలామంది కొత్త సంవత్సరం తీసుకున్న నిర్ణయాల్లో ఒకటి. వ్యాయామాలు, రకరకాల థెరపీలు, చికిత్సలు ఎన్ని చేసినా బరువు పెరగడమే కాని తగ్గే ప్రశక్తి లేదా అంటూ వాపోయే వారికి ఓ శుభవార్త. ఇటలీ శాస్త్రవేత్తలు కార్బన్‌డైఆక్సైడ్‌తో బరువు తగ్గే ఉపాయం చెబుతున్నారు...అలా ఆశ్చర్యపోవద్దు. మీరు విన్నది నిజమే. పెద్ద పెద్ద చికిత్సలేం అవసరం లేకుండా కార్బన్‌డైఆక్సైడ్‌తోనే బరువు తగ్గడం సాధ్యం. అదీ ఒకే ఒక్క ఇంజెక్షన్‌తో. ఇటలీలోని సియాన్ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తల నివేదిక ప్రకారం... మహిళల్లో ఊబకాయం భవిష్యత్తులో అనేక ఇబ్బందులకు దారి తీయొచ్చు. మహిళల కొవ్వు కణజాలంపై ప్రత్యేకమైన కార్బన్‌డైఆక్సైడ్‌తో చేసిన ప్రయోగాలు అధిక బరువు సమస్యకు చెక్ పెడుతున్నాయి. చర్మంకింద, చుబుకం కింద, పొత్తికడుపు, పిరుదుల్లో పేరుకున్న కొవ్వును ఈ కార్బన్‌డైఆక్సైడ్ కరిగిస్తుంది. దీని వల్ల గుండెజబ్బులు, మధుమేహం వంటి ప్రాణాంతక వ్యాధుల నుంచి రక్షణ కలుగుతుంది.sourse eenadu
దీనికి సబ్స్క్రయిబ్ చెయ్యి:
పోస్ట్‌లు (Atom)